ముందస్తు సమాచారం లేకుండా మద్యం షాపులు మూస్తే ఎలా అని గజపతినగరం మండలంలో పలువురు మద్యం ప్రియులు ప్రభుత్వాన్ని బాహాటంగా నిలదీస్తున్నారు. అర్ధాంతరంగా మద్యం షాపులు మూసివేయడంతో మద్యానికి అలవాటైన వారు తీవ్ర అవస్థలు పడుతున్నారని పలువురు మందుబాబులు నిరసన తెలుపుతున్నారు. సత్వరమే షాపులు తెరవాలని డిమాండ్ చేస్తున్నారు. కనీసం ముందస్తు సమాచారం లేకుండా మద్యం షాపులు మూసివేయడం తగదని అంటున్నారు.