బొబ్బిలి నియోజకవర్గం బాండంగి మండలంలోని ఆరు గ్రామాల చెందిన ప్రజానీకం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నావికాదళ యుద్ధ సామగ్రి నిల్వ కేంద్రం ఏర్పాటు పేరిట పచ్చటి పైరు భూములు లాగేసుకుని రైతుల బతుకుల్లో చిచ్చురేపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయంటున్నారు. ఈ గ్రామాల్లో వందలాది మంది రైతులు సారవంతమైన భూములు కోల్పోతమని, ఈ సాయుధ డిపో ఏర్పాటుతో రైతులంతా తమ జీవనాధారం పోతుందని ఆందోళన చెందుతున్నారు.