ప్రజలు సేవాభావాన్ని అలవర్చుకోవాలని జిల్లా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కెల్ల శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ కెల్ల వెంకటలక్ష్మిలు కోరారు. ఆదివారం దత్తిరాజేరు మండలంలోని రాజుల రామచంద్రపురం శివారు గిరిజన గ్రామాల్లోని పేదలకు ప్రముఖ సామాజిక సేవకులు, విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో సీనియర్ సహాయకులు రెట్టంగి శంకరరావు సమకూర్చిన దుస్తులను వారు పంపిణీ చేశారు. ఈ మేరకు శంకరరావును అభినందించారు.