AP: వైసీపీకి విశాఖ నగరంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకే రోజు ఎదురుదెబ్బలు తగిలాయి. మాజీ ఎమ్మెల్యే, భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రావు ఇద్దరూ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్‌కు పంపించారు. పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు, విధానాలు నచ్చకే రాజీనామా చేసినట్లు వారు వెల్లడించారు.