ఉదయగిరి: ప్రభుత్వాలను నిలదీస్తూ ప్రజల పక్షాన నిలబడాలి
ఉదయగిరి పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ఉదయగిరి, వరికుంటపాడు, సీతారాంపురం మండలాల ప్రాంత మహాసభ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ సమక్షంలో ముందుగా పార్టీ జెండాను ఎదురు వేశారు. అలాగే మహనీయులకు ఘనంగా నివాళులర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తూ ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యల కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు.