రాష్ట్ర ప్రభుత్వం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని టీటీడీ పాలకమండలి సభ్యురాలిగా ప్రకటించింది. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులను ఆదివారం కలసి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో కూడా టీటీడీ బోర్డు సభ్యునిగా నిరంతరం దేవదేవుడు సేవలో మెరుగైన సేవలందించారని మన్నేటి తెలియజేసారు. ఆయనతో ఉదయగిరి టిడిపి నాయకులు ఉన్నారు.