వరికుంటపాడు మండల వైద్యాధికారిణి ఆయేషా ఆధ్వర్యంలో శనివారం ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష యోజన పథకం కింద 13 మంది గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు పలు సూచనలు చేశారు. పోషక విలువలు కలిగిన ఆహారం ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన రక్తహీనత సోకకుండా ఉంటుందని తెలిపారు. గర్భిణీలు ఎక్కువగా ఎటువంటి పని చేయవద్దని సూచించారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు.