తిరుపతి జిల్లా నాయుడుపేట మునిసిపల్ కార్యాలయం ఎదుట కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని శనివారం మునిసిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు చాపల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. గత 3నెలలుగా పెండింగ్ వేతనాలు చెల్లించకపోవడం బాధకరమన్నారు. గత ప్రభుత్వంలో సమ్మె కాలపు ఒప్పందాలను టీడీపీ ప్రభుత్వం అమలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.