డిజిటల్ నెట్‌వర్కింగ్ లో జరుగుతున్న మోసాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి సైబర్ క్రైమ్ అధికారి నరసింహారావు స్పష్టం చేశారు. శుక్రవారం సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళి నాయుడు అధ్యక్షతన సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ వంటివి ఉపయోగిస్తున్నప్పుడు ఎవరు పడితే వారితో చాటింగ్ చేసుకోవడం మోసానికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.