సత్యవేడు నియోజకవర్గం కేవీబీ. పురం మండలం తిమ్మసముద్రం వద్ద రాకపోకలు నిలిచిపోయినట్లు గురువారం స్థానికులు తెలిపారు. వరద నీటికి భారీగా చెట్లు కొమ్మలు కొట్టుకు రావడంతో అవి రోడ్డుపై నిలిచిపోయాయి. వరద ప్రవాహం పెరగడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. పిచ్చాటూరు, కేవీబీ పురం, శ్రీకాళహస్తిలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు