బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా వరదయ్య పాలెం మండలంలో బుధవారం సాయంత్రం ప్రారంభమైన వర్షం గురువారం తెల్లవారుజాము కూడా కురుస్తూనే ఉంది. వర్షానికి వీధులు జలమయం అయ్యాయి. ఇప్పటికే మండలంలో వాగులు వంకలు నిండుకుండగా మారాయి. వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.