బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వాతావరణం మారిపోయింది. తిరుపతి జిల్లా నాగలాపురం మండలంల్లో గురువారం వేకువజాము నుంచి భారీ వర్షం కురిసింది. మరోవైపు చలికి ప్రజలు వణకిపోయారు. కుండపోత వర్షం కురవడంతో రైతులు వరి పొలాలకు మేలు చేకూరుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.