పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలంలో కల్లూరు గ్రామ దేవత శ్రీ విరుపాక్షమ్మ ఆలయంలో శుక్రవారం దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం అమ్మవారికి అభిషేకం చేసి, ధనలక్ష్మి దేవి అలంకారంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు నైవేద్యం సమర్పించి, మహా మంగళ హారతి గావించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.