రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తెలిపారు. గురువారం పలమనేరు బస్టాండ్లో 7 నూతన బస్సులను ఆయన ప్రారంభించారు. అందులో నాలుగు పల్లె వెలుగు, 3 ఎక్స్ ప్రెస్ సర్వీసులు ఉన్నాయి. భవిష్యత్తులో మరో 9 బస్సులు డిపోకు రానున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలమనేరు డిపో మేనేజర్ స్వామి, సిబ్బంది పాల్గొన్నారు.