నెల్లూరు: కార్మిక సదస్సును జయప్రదం చేయండి
సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం నెల్లూరు నగరంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరిగే కార్మిక సదస్సును జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. నగరంలోని రామచంద్ర రెడ్డి భవన్ లో గురువారం ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, కార్మిక వర్గం కర్తవ్యాలు అనే అంశంపై సదస్సు జరుగుతుందన్నారు.