చిత్తూరు జిల్లా,నగిరి నియోజక వర్గం, పుత్తూరు రూరల్ సీఐగా గురువారం సాయంత్రం జి రవీంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు నారాయణవనం పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది స్వాగతం పలికారు. సీఐ మాట్లాడుతూ పుత్తూరు రూరల్ సర్కిల్ పరిధిలోని నారాయణవనం, పిచ్చాటూరు, కేవీబీ పురం, పుత్తూరు, వడమాల పేట మండలాలలో శాంతి భద్రతలను కాపాడటానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.