ముత్తుకూరు: గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
తోటపల్లిగూడూరు మండలం కోడూరు బీచ్లో గల్లంతైన ఓ వ్యకి మృతదేహం ఆదివారం ముత్తుకూరు మండలం నేలటూరులోని సముద్రం ఒడ్డున లభ్యమైనట్లు ఎస్ఐ వీరేంద్రబాబు ఆదివారం తెలిపారు. కోడూరు సముద్రతీరంలో కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఆత్మకూరు సురేష్(45) కుటుంబ సభ్యులతో కలిసి సముద్రస్నానం చేస్తుండగా గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది.