వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గత కొంతకాలంగా బాధితులు నిరసన కార్యక్రమాలు చేపట్టుతున్నారు. సోమవారం లగచర్ల గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో భూసేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కోసం గ్రామసభ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు.