మద్దూరు: ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆకస్మిక తనిఖీ

79பார்த்தது
మద్దూరు: ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆకస్మిక తనిఖీ
కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండల కేంద్రంలోని పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయిల్, కూల్ డ్రింక్స్, మటన్, చికెన్, రైస్, కూరగాయలు తదితర సామాన్లను పరిశీలించారు. కాలం చెల్లిన వస్తువులను వాడి ప్రజల ఆరోగ్యాలకు ముప్పు తెస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி