ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం గూడూరు ఎమ్మెల్యే డా. పాశం సునీల్ కుమార్ కలిసి విజయవాడ వరద బాధితులకు సహాయార్ధం కోటి రూపాయల విరాళం చెక్కును జీవిఆర్ కంపెనీ ప్రతినిధులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యేను సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగా ప్రసాద్, జీవిఆర్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.