తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. ఈనెల 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సంప్రదాయ వస్త్రధారణ పై నేటి యువతరానికి అవగాహన కోసం విన్నర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనర్, శిల్పారామం సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టింది. ఇందులో పెద్దఎత్తున యువతులు పాల్గొని వారే స్వయంగా డిజైన్ చేసిన వస్త్రధారులను ప్రదర్శించారు.