74వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 108 సర్వీసు లో ఉత్తమమైన సేవలు అందించినందుకు గాను టెక్కలి నియో నేటల్ అంబులెన్స్ కు చెందిన ఈ యం టి (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ) శ్రీనివాస్ బెహార కి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ తన చేతుల మీదుగా ప్రశంసాపత్రంను గురువారం అందిస్తూ అభినందించారు. అప్పుడే పుట్టిన శిశువు ప్రాణాపాయ పరిస్థితుల నుండి రక్షించబడినందుకు గాను ఈ అవార్డు ను ఇచ్చినట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా టెక్కలి మండల 108 ఉద్యోగులు దేవాది శ్రీనివాసరావు, జోగి ఆదినారాయణ హనుమంతు జగదీష్, సాహుకారి రాజేష్, మూగి దుర్గారావు, జలుమూరు శశి, బొంతల రాము, పూజారి శ్రీను, సింహాచలం, నూనెలు ఆనంద్ లు అభినందించారు.