సంతబొమ్మాలి మండలం కాపుగోదాయవలసకు చెందిన సంగీత విద్వాంసులు తామడ శేషయ్య గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆకస్మికంగా మరణించారు. మండలంలోని కాపుగోదాయవలస, తర్లిపేట, నారాయణపురం, చలమయ్య పేట గ్రామాలకు సర్పంచ్ గా ఈయన పని చేశారు. టీడీపీ నేతగా ప్రజలకు ఎన్నో సేవలు అందించారని పలువురు ఆయనను కొనియాడారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు నివాళులు అర్పించారు.