టెక్కలి మండలం సవరగోపాలపురం లో ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయి గూడి సీమోన్(3), గూడి సరిత(5) అనే ఇద్దరు చిన్నారులు అనాధలయ్యారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న టెక్కలి అభయం యువజన సేవాసంఘం సభ్యులు వెంటనే స్పందించి, కాపల నారాయణ రావు 5000/-, అప్పిని విజయ్ 3000/-, ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ సంబాన శ్రీనివాస్ 2000, తో అభయం సేవాసంఘం నిధుల నుండి 10000 కలిపి మొత్తం 20, 000/- ఆర్థిక సహాయం తోపాటు పిల్లలకు నూతన వస్త్రాలు, బిస్కట్స్, నెలకు సరిపడే విధంగా నిత్యవసర వస్తువులను, చిన్నారుల సంరక్షకులకు అందజేసినట్లు అభయం యువజన సేవాసంఘం అధ్యక్షుడు దేవాది శ్రీనివాసరావు తెలిపారు. 5 ఏళ్ళు కూడా పూర్తి కాని ఆ చిన్నారులను చూసి స్థానికులు కంటతడి పెట్టుకుంటున్నారు , దాతలు ఎవరైన పిల్లలకు సహాయం చేయాలనుకుంటే మా అభయం యువజన సేవాసంఘం ఫోన్ పే నెంబర్ 9494587587 కి వేస్తే, ఆ సహాయాన్ని పిల్లలకు అందిస్తామని ఆయన తెలిపారు.