అరబిందో ఈ ఎం ఎస్ లో నడుస్తున్న 108 మరియు 104 సర్వీసెస్ లను అన్ని రకాల మందులు మరియు అన్ని రకాల సర్వీసును ఉచితంగా ఇవ్వడంలో ముందంజలో ఉంది అని శ్రీకాకుళం జిల్లా అధికారి నజీర్ గారు మరియు టెక్కలి డివిజన్ అధికారి నాగేష్ గారు తెలియజేయడం జరిగింది. శుక్రవారం నందిగామ మండలం 108 అంబులెన్స్ తనిఖీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కోవిడ్ మూడవ దశ ను ఎదుర్కోవడానికి 108 సర్వీసులు సిద్ధంగా ఉన్నాయి అన్నారు. అరబిందో 104,108 సర్వీస్ ని ప్రజలు ఎటువంటి ఎమర్జెన్సీ లేదా నాన్ ఎమర్జెన్సీ ఉన్నా తప్పకుండా 108 కి ఫోన్ చేసి ఉపయోగించుకోవలసిందిగా ఆయన కోరారు.
ఆయనతోపాటు నందిగాం 108 వాహన సిబ్బంది కె.వి.రమణ,కుమార్ స్వామి పాల్గొన్నారు.