పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా స్వర్ణాంధ్ర వేడుకలు
పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జె వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర -2047 కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గౌతు శిరీష హజరై మాట్లాడుతూ. 2047 నాటికి స్వాతంత్రం వచ్చి వందేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా రాష్ట్రం సమగ్ర అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ముందుకు తీసుకువెళ్లే పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించారు.