శ్రావణమాసంలో నియమనిష్టలతో భక్తులు లక్ష్మీదేవి ఆరాధన చేస్తారు. ఇందులో భాగంగానే శ్రావణమాసము నాడు శివపార్వతుల కళ్యాణం చేయడం ఓ ఆనవాయితీ. ఈ సందర్భంగా పలాసకాశీబుగ్గ మున్సిపాల్టీ పరిధిలోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కోసంగిపురంలోని పాతాళ నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో శనివారం శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించారు. ముందుగా దేవాలయంలోని మూలవిరాట్టుకు పూజలు చేసి అనంతరం కళ్యాణాన్ని నిర్వహించారు.