కాశీబుగ్గలో ఒక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులను తోటి విద్యార్థి దేవేంద్ర లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పాఠశాల హెచ్ఎం దృష్టికి విద్యార్థినులు తీసుకెళ్లినా స్పందించడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో శుక్రవారం విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వెళ్లి ధర్నా చేశారు.