నియోనాటల్ అంబులెన్స్ సేవలను వినియోగించుకోండి

654பார்த்தது
నియోనాటల్ అంబులెన్స్  సేవలను వినియోగించుకోండి
ఆంధ్రప్రదేశ్ లో గల శిశు మరణాల రేటును తగ్గించే చర్యలలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవ జాత శిశువుల కోసం నూతనంగా ప్రవేశ పెట్టిన టెక్కలి డివిజన్ నియోనాటల్ 108 అంబులెన్స్ సోమవారం మందస మండలం హరిపురం ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ ప్రకాష్ వర్మ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఆసుపత్రి వద్ద ఆశ, ఏ యన్ యం లకు నియోనాటల్ 108 లో అత్యాధునిక వైద్య పరికరాలు అయిన వెంటిలేటర్, ఇంక్యూబెటర్ , మోనిటర్, సిరంజ్ అండ్ ఇన్ఫ్యూజన్ పంప్ ఉన్నాయని వాటి ప్రత్యేకతలు వివరించారు.

అలాగే అత్యవసర ప్రాధమిక చికిత్స అందిస్తూ, చికిత్స నిమిత్తం అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి కే, కాకుండా పేషెంట్ సహాయకులు కోరిక మేరకు సమీప ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తారని ఈ యం టి పైడిరాజు తెలియజేస్తూ, ఈ నియోనాటల్ 108 అంబులెన్స్ సేవలు ప్రజలు వినియోగించుకొనేలా ప్రజలకు తెలియజేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక 108 సిబ్బంది ఏ పైడిరాజు, సాహుకారి రాజేష్ పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி