మందస మండలం మారుమూల గిరిజన గ్రామమైన కుడమాసింగిలో సవర హీరామణి అనే 20 సంవత్సరాల గర్భిణీ మొదటి కాన్పు పురిటి నొప్పులతో పలాస ప్రభుత్వ హాస్పిటల్‌కి వెళ్లగా బేబీ చిన్నగా ఉంది ఇక్కడ డెలివరీ చేయడం కష్టం అని టెక్కలి ప్రభుత్వ హాస్పిటల్ కి రిఫర్ చేశారు. టెక్కలి ప్రభుత్వ హాస్పిటల్ వాళ్ళు జరాయువు (మాయ) ముందుకు ఉంది ఇక్కడ డెలివరీ కష్టం అని చెప్పి నందిగాం 108లో శ్రీకాకుళం రిమ్స్ కి రిఫర్ చేశారు.
నందిగాం 108 సిబ్బంది టెక్కలి జిల్లా హాస్పిటల్ నుండి శ్రీకాకుళం రిమ్స్ కి తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలో నొప్పులు ఎక్కువ కావడంతో 108ని నిలిపివేసి ఈయంటి దేవాది శ్రీనివాసరావు అతి జాగ్రత్తగా డెలివరీ చేయగా పండంటి మగ బిడ్డను జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని 108 సిబ్బంది ఈ యం టి దేవాది శ్రీనివాసరావు, పైలట్ సర్లన చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంలో కుటుంభ సభ్యులు 108 సిబ్బందిని అభినందిస్తూ, రెండు ప్రభుత్వ ఆసుపత్రుల డాక్టర్‌లు డెలివరీ కష్టం అని చెప్పి మమ్మల్ని భయపెట్టడంతో ఆందోళన చెందాము, కానీ నందిగాం 108 సిబ్బంది 108 వాహనంలోనే డెలివరీ చేసి తమ గుండెల్లో ఆనందాన్ని నింపారని, కుటుంబ సభ్యులు, బంధువులు, 108 ఉద్యోగుల సేవలను కొనియాడారు. 108 అనేది పేదలపాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తుందని ప్రశంసించారు.