సోంపేట మండలం తురక శాసనాం గ్రామానికి చెందిన జవాన్ ఏదుర్ల నాగేశ్వరరావు (57) అరుణాచల్ ప్రదేశ్లో విధి నిర్వహణలో అనారోగ్య కారణంగా మృతి చెందాడు. కాగా జవాన్ భౌతికకాయాన్ని శుక్రవారం ప్రత్యేక వాహనంలో ఆర్మీ అధికారులు స్వగ్రామానికి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సమీప ప్రాంత ప్రజలు వందలాదిమందిగా జవాన్ అంత్య క్రియల్లో పాల్గొనగా అధికార లాంఛనాలతో అంత్య క్రియలు పూర్తయ్యాయి.