మందస మండలం రాంపురం గ్రామంలో సచివాలయం ఎదుట శనివారం ఉద్దాన ప్రాంతానికి చెందిన పలువురు రైతులు నిరసన వ్యక్తపరిచారు. మా భూములే మాకు ముద్దు- ఎయిర్ పోర్ట్ మాకు వద్దు అంటూ మహిళలు నినాదాలు చేసారు. ఈ మేరకు సుమారు 1383 ఎకరాలలో నిర్మాణం గాను అధికారులు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం స్థల పరిశీలన కూడా గావించడం పై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.