కవిటి మండలం రామయ్య పుట్టుగలో శనివారం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ను నియోజకవర్గ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మర్యాదపూర్వకంగా కలిశారు. విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే కు వివరించి వినతిపత్రం అందజేశారు. రేషనలైజేషన్, టెక్నికల్ పే స్కేల్ వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వచ్చినట్లు జిల్లా ఏఎస్ఈ వైస్ ప్రెసిడెంట్ జయకృష్ణ తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారన్నారు.