శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బాసుబంజీరిలో మంచినీటి కొరతను అరికట్టే దిశగా సర్పంచ్ సింహాచలం చర్యలు చేపట్టారు. సుమారు రూ. లక్షా యాభై వేల పంచాయతీ నిధులతో మంచినీటి బోరుకు శ్రీకారం చుట్టారు. పంచాయతీలో తాగునీటి సమస్యను నివారించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు మంగళవారం సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బొండాడ నీలవేణి, లింగరాజు, వంకల జయరాం, సాలీన మోహనరావు, గ్రామస్థులు పాల్గొన్నారు.