ఆముదాలవలస టిడిపి కార్యాలయంలో గురువారం స్థానిక టిడిపి నాయకులు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు తమ్మినేని విద్యాసాగర్ మీడియా సమావేశం నిర్వహించారు. సామాన్యునికి కూటమి ప్రభుత్వం నిత్యవసర ధరలు అదుపులోకి తెచ్చిందని అన్నారు. రైతు మార్కెట్ ద్వారా సబ్సిడీ టమాటా విక్రయాలు, కందిపప్పు విక్రయాలు చేపట్టామన్నారు. వైసిపి హయాంలోనే ధరలు ఎక్కువగా పెరిగాయని, వైసీపీ నాయకుల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు.