కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోటబొమ్మాళిలో మధ్యాహ్నం అందుబాటులో ఉంటారని క్యాంప్ కార్యాలయం ఒక ప్రకటనను ఆదివారం విడుదల చేసింది. సోమవారం మధ్యాహ్నం 12. గంటల నుంచి రెండు గంటల వరకు ప్రజా సదన్‌లో లబ్ధిదారుల నుంచి వినతులు స్వీకరించడం జరుగుతుందని కార్యాలయ వర్గాలు తెలిపాయి. స్థానిక ప్రజలు తమ సమస్యలను వినతుల రుపంలో అందించాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిబ్బంది కోరారు.