టెక్కలిలో ఆదివారం తూర్పు కాపుల ఆత్మీయ సమ్మేళన సభను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టెక్కలి, నందిగాం, పలాస పరిస ప్రాంతాల కుటుంబ సభ్యులు, సంఘ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన, సామాజిక వర్గ అభ్యున్నతితో పాటు ఇతర అంశాల గురించి చర్చించారు. సమావేశంలో తూర్పు కాపు పెద్దలు డా. చిన్నం నాయుడు, యం గణపతి రావు, కర్రి మోహన రావు, చంద్రశేఖర్, కమిరి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.