పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో నూతన పబ్లిక్ హెల్త్ యూనిట్ సెంటర్ నిర్మాణ పనులను గురువారం ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉద్దాన ప్రాంత ప్రజలకు వైద్య సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావాలని ఉద్దేశంతో నూతన భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.