పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం సైబర్ క్రైమ్ మోసాల గురించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ డి మోహన్ మాట్లాడుతూ విద్యార్థులు ఆన్లైన్లో సైబర్ మోసాలకు ఎక్కువగా గురౌవుతున్నారని, అధిక మొత్తంలో డబ్బును పోగొట్టుకుంటున్నారని తెలిపారు. అదేవిధంగా సైబర్ మోసాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.