ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అతని వద్ద బ్యాగ్ లో 10 కిలోల గంజాయిని గుర్తించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కేరళలో భవన నిర్మాణ పనులు చేస్తూ ఒడిసాలో గంజాయిని కొని కేరళలో అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. ముద్దాయిని అరెస్ట్ చేసి ఇచ్చాపురం కోర్టుకు తరలించినట్లు సీఐ చిన్నంనాయుడు తెలిపారు.