ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట పంచాయితీ లక్ష్ముడుపేట సమీపంలో సోమవారం సాయంత్రం పేకాట శిబిరంపై ఎస్సై వి. సందీప్ కుమార్ వారి సిబ్బందితో దాడి చేశారు. ఈ మేరకు ఆరుగురు వ్యక్తుల పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మంగళవారం తెలిపారు. వారి నుంచి రూ. 52000 నగదు, రెండు బైకులు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.