సరుబుజ్జిలి: అభివృద్ధే ధ్యేయంగా ప్రతి ఒక్కరు పని చేయాలి

64பார்த்தது
సరుబుజ్జిలి: అభివృద్ధే ధ్యేయంగా ప్రతి ఒక్కరు పని చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తుందని గ్రామాల్లో అభివృద్ధే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. గురువారం సరుబుజ్జిలి మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పంచాయతీ నిధులను పక్కదారి పట్టించడంతో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி