ఆముదాలవలస తాలూకా శిష్టకరణ సంఘం పిక్నిక్ కార్యక్రమాన్ని మరియు సర్వసభ్య సమావేశాన్ని గేదెలవానిపేట దరి శివాలయం వెనుక ఈ దినము జరిగినది. ఈ కార్యక్రమంలో వయోవృద్ధులకు సన్మానించుకొనుట జరిగినది. వనభోజన కార్యక్రమం చాలా వైభవంగా జరిగినది. కల్చరల్ ఆక్టివిటీస్తో యువకులు ఆనంద ఉత్సవాన్ని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా శిష్ట సంఘ అధ్యక్షులు డబ్బేరి శ్రీనివాసరావు, రామచంద్ర రావు, ఆర్ వి ఎస్ ఎన్ శర్మ, వెంకటేశ్వరరావు, పాల్గొన్నారు.