తాడిపత్రి పట్టణం, రూరల్ ప్రాంతాల్లోని దాబాలు, రెస్టారెంట్లలో మద్యం తాగితే యజమానులపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రామకృష్ణుడు తెలిపారు. శనివారం రూరల్ పోలీస్ స్టేషన్ లో దాబా, రెస్టారెంట్ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. 10 గంటల్లోగా వ్యాపారాలు మూసివేయాలని సూచించారు. ఏవైనా గొడవలు జరిగితే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు.