పెద్దపప్పూరు మండలంలోని అశ్వర్థ ఆలయంలో శుక్రవారం అధికారులు హుండీలోని కానుకలను లెక్కించారు. అశ్వర్థ నారాయణస్వామి, శ్రీచక్రభీమలింగేశ్వర స్వామి ఆలయాలలో 9 నెలలకు సంబంధించి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ. 11. 14 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. లెక్కింపులో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.