యల్లనూరు: ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడి అరెస్ట్

52பார்த்தது
యల్లనూరు: ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడి అరెస్ట్
యల్లనూరు మండలంలోని వెన్నపూసపల్లికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని యువతి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యువకునిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యబాబు, ఎస్ఐ రాంప్రసాద్ తెలిపారు. నిందితుడిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி