తీవ్ర తుఫాన్ కారణంగా గత రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు పుట్లూరు మండలంలోని చింతకుంట గ్రామానికి చెందిన గోగుల హనుమంతు ఇంటి పైకప్పు బుధవారం పూర్తిగా కూలిపోయింది. ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ బాధితులకు ఫోన్ చేసి పరామర్శించారు. ప్రభుత్వం నుండి సాయం అందించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నివేదికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.