నవ్యాంధ్ర నిర్మాత నారా చంద్రబాబునాయుడుపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపై మంగళవారం శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ మండిపడ్డారు. పదవి కోల్పోయిన గోరంట్ల మాధవ్ కు పిచ్చిపట్టిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణలను విమర్శించే స్థాయి ఆయనకు లేదన్నారు. మాధవ్ చేసిన అవినీతి, అరాచకాల వల్లే వైకాపాలో టికెట్ కూడా దక్కలేదని దుయ్యబట్టారు.