ఇంకుడు గుంతల నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో నిర్మల కుమారి బుధవారం పేర్కొన్నారు. శింగనమల మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఇంకుడు గుంతలకు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం మండలానికి వెయ్యి ఇంకుడు గుంతలు మంజూరు చేసిందని తెలిపారు. ఆసక్తి కలవారు ఇంకుడు గుంతల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.