చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో గురువారం ప్రజలకు, వాహన చోదకులకు, రహదారిపై వెళ్లే వాహనాలను ఆపి డ్రైవర్లకు, స్థానికులకు ఎస్సై, పోలీసులు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్లకూడదని సూచించారు. వాహన డ్రైవర్లకు తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలని తదితర నిబంధనలను తెలియజేశారు.